భారత్ సమాచార్.నెట్, మెదక్: శివంపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించనున్నారు. శివంపేట పీఏసీఎస్ ఛైర్మన్ చింతల వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ప్రారంభోత్సవాలను చేయనున్నారు. ఉదయం 8:30 గంటలకు కొంతాన్‌పల్లిలో ప్రారంభించి, అనంతరం ఉసిరికపల్లి, సీతారాం తండా, రత్నాపూర్, పిల్లుట్ల, అల్లీపూర్ గ్రామాల్లో వరుసగా ప్రారంభిస్తారు. చివరగా మధ్యాహ్నం 1 గంటకు శివంపేటలో సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలకు రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మండల నాయకులు కోరారు.