భారత్ సమాచార్.నెట్, మెదక్: చిలప్‌చెడ్ మండలం గంగారం గ్రామ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సోమవారం ప్రారంభమైంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా గ్రామంలోని పెద్దలు, అధికారులు రైతులకు సూచించారు. ధాన్యం కొనుగోలు సజావుగా సాగేందుకు అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, సీఏవీవో అధ్యక్షురాలు ఏపీఎం గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు





