భారత్ సమాచార్.నెట్, కర్నూలు: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆది కృష్ణమ్మ శనివారం ఆదోని మండలం కుప్పగల్లు గ్రామంలో పర్యటించారు. ఆమె ‘కృష్ణమ్మ సేవా సైన్యం’తో కలిసి అంగన్వాడీ పరిసరాల్లో చెత్తను తొలగించి, పాముల బెడదను నివారించారు. పెండింగ్‌లో ఉన్న కళ్యాణమండపం, అసంపూర్తి సచివాలయం పనులను పరిశీలించి, నిధుల సమీకరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిలిచిన డ్రైనేజీలు, మురుగునీటి సమస్యలు, సీసీ రోడ్డు నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని…