భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో తులతూగుతూ ఉండాలని, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. భోగి పండుగను మంటలతో, సంక్రాంతిని పొంగలి, పిండివంటలు, పితృ దేవతలు, దేవుళ్ల పూజలతో, కనుమ పండుగను కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.