భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు చందు రాజకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, వందేమాతరం గేయానికి 150 వసంతాలు పూర్తైన సందర్భంగా దేశభక్తి స్ఫూర్తిని చాటేలా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువత, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న వారు చేతుల్లో జాతీయ జెండాలను…





