భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఇంటి నిర్మాణానికి దరఖాస్తు గడువును పొడిగించాలని, నిర్మాణ వ్యయాన్ని పెంచాలని సీపీఐ మండల కార్యదర్శి ఎం. నరసరావు డిమాండ్ చేశారు. దేవనకొండలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంపీడీవో గోపాల్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నరసరావు మాట్లాడుతూ.. దరఖాస్తు గడువు ఈ నెల 30తో ముగియనుండటంతో అర్హులైన పేదలు అవకాశం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్మాణ సామగ్రి ధరలు అధికంగా ఉన్నందున, లబ్ధిదారులు రూ.1.59 లక్షలతో ఇల్లు పూర్తి చేయడం అసాధ్యమని,…



