భారత్ సమాచార్, యాదాద్రి జిల్లా: సిపిఎం జిల్లా కమిటీ పిలుపు మేరకు ఆలేరు మండలంలోని కంది గడ్డ గ్రామంలో గురువారం ఇంటింటికి తిరిగి గ్రామీణ కుటుంబ సర్వేను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకుడు ఎం.ఏ. ఇక్బాల్ పాల్గొన్నారు. సర్వే సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు మారినా ప్రజల బతుకులు మాత్రం మారడం లేదని గ్రామాల్లో ప్రజల వేదన చూస్తే అర్థమవుతుందని అన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రజాప్రతినిధులు…