భారత్ సమాచార్.నెట్, కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గంలో పేదల గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు కృషి చేయాలన్నారు.
శనివారం తన కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ), అవనిగడ్డ ఇంఛార్జి డీఈఈ ఎస్. వెంకట్రావుతో ఆయన సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో స్థలాలు కలిగి ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న 2,198 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు…



