భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. బ్రాహ్మణపల్లి–వెంకటాపూర్ శివారు ప్రాంతం నుంచి తూప్రాన్ వైపు అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న టిప్పర్ను పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు.
ఈ సందర్భంగా టిప్పర్ డ్రైవర్ అబ్దుల్ అజార్, టిప్పర్ యజమాని ఇతారి కృష్ణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా…





