భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కమిషనర్ పీ.విశ్వనాథ్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉద్యోగులతో ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఓటు విలువైనదని గుర్తుచేశారు. ప్రతి ఓటరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించాలని, 18 ఏళ్లు పూర్తి అయిన ప్రతి వ్యక్తి తన పేరు ఓటర్ జాబితాలో నమోదు చేసుకుని ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు, అధికారులు ఈ ప్రతిజ్ఞలో చేరి, ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ పాత్రను…