భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో పనిచేస్తూ మరణించిన 13 మంది పారిశుద్ధ కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాల్లో భాగంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని AITUC, IFTU నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం వరుసగా 14వ రోజు కొనసాగుతున్న నిరాహార దీక్షల్లో భాగంగా మోకాళ్లపై కూర్చొని వినూత్న నిరసన చేపట్టారు. కుటుంబాలు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇదివరకే ఇచ్చిన హామీలు అమలు చేయలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం వరకు నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.