భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెల్లికుదురులోని పలు షాపుల్లో చైనామాంజాపై నెల్లికుదురు సెక్షన్ ఫారెస్ట్ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. డీవైఆర్‌వో సంతోష్, ఎఫ్‌బీవో ఆదినారాయణ, ఎఫ్ఆర్ఓ విజయలక్ష్మి సూచనల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. చైనా మాంజాను అమ్మినా.. కొనుగోలు చేసినా వినియోగించినా నేరమని అన్నారు. చైనా మాంజా వలన పక్షులతోపాటు, ప్రజలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం వీటిని విక్రయించిన వారికి జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారన్నారు. మన దగ్గర…
దుకాణాల్లో తనిఖీలు.. చైనామాంజా విక్రయిస్తే చర్యలు





