భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ యాదగిరి టోల్‌వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భువనగిరి కేంద్రీయ విద్యాలయంలో ఇంటరిజ్ ఇన్‌స్పైర్ అవార్డ్స్–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులు ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం భువనగిరి, బీబీనగర్ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ అక్షాన్ష్…