భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 36 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇనుగుర్తి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసి ప్రజలు, అన్ని శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.

భారీ వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని తహసీల్దార్ ఆదేశించారు. వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు తమ…