భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదలలో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ సంఘం భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని సంఘం నాయకులు ఆహ్వానించారు. ఈ నెల 19న జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ సంఘం అధ్యక్షుడు కుంటి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ముదిరాజ్ సంఘం భవన ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హాజరై…