భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: వలిగొండ మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి దామోదర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అనేకమైన ప్రజా సమస్యలు చాలా పేరుకు పోతున్నాయని, పేదలు వేసుకున్న గుడిసెలు కూలగొడుతున్న ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లలో జాప్యం, సన్నాళ్లకు బోనస్ లేదు, రైతుబంధు లేదు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేదలను గుర్తించి…