భారత్ సమాచార్, కర్నూలు ;

రాయలు వారు ఏలిన నేల రాయలసీమలో ఒకప్పుడు వజ్రాలు అన్నీ కుప్పలుగా పోసీ అమ్మేవారట. ఆ తర్వాత కాలక్రమేణా రాయలసీమ కరువు ప్రాంతంగా మారిపోయిన విషయం అందరికి తెలిసిందే. సీమ లోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చాలా కాలం నుంచి వర్షం వస్తే వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ చాలా మందికి వజ్రాలు కూడా దొరికాయి. తాజాగా కర్నూలు జిల్లా మద్దెకర మండలం హంప గ్రామంలో ఓ రైతు పొలం పనుల్లో ఉండగా…