భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: పనసపండు రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదనే విషయం చాలా మందికి తెలియదు. దీనిని జాక్‌ఫ్రూట్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పండులలో ఒకటి. ఇందులో ఉండే విటమిన్ A, C, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు శరీరానికి బలాన్ని అందిస్తాయి. అలాగే దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికారక ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
పనసపండు గుజ్జు, గింజలు రెండూ ఆరోగ్య విలువలతో నిండినవే. గింజల్లో ఉండే ప్రోటీన్ పేశీ నిర్మాణానికి తోడ్పడుతుంది.…

