భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలులోని జూపాడు సమీపంలో ఉన్న కేవీ సుబ్బారెడ్డి కళాశాలలోని అయాన్ డిజిటల్ సెంటర్‌లో బుధవారం జేఈఈ మెయిన్స్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే పరీక్ష కేంద్రం పరిసరాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి నెలకొంది. పరీక్ష సమయం దగ్గరపడడంతో చివరి నిమిషంలో వచ్చిన పలువురు విద్యార్థులు పరీక్షా కేంద్రాల వైపు పరుగు తీశారు. పరీక్ష నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.…
కర్నూలులో జేఈఈ మెయిన్స్ పరీక్షలు





