భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజలను చైతన్య పరిచి, ప్రభుత్వ పథకాలను నిరుపేదలకు అందించేందుకు జర్నలిస్టులు బాధ్యతగా పనిచేయాలని సీనియర్ రిపోర్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలకు, నిరుపేదలకు న్యాయం జరిగినప్పుడే జర్నలిజం వృత్తికి విలువ పెరుగుతుందన్నారు. విలువలతో కూడిన జర్నలిజం చేయడం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వినోద్ కుమార్, నర్సింహులు అక్రిడిటేషన్ కార్డులు తీసుకున్న సందర్భంగా వారు మాట్లాడారు.
విలువలతో కూడిన జర్నలిజం ఎంతో అవసరం





