భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్: దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు, పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బోధన్ పట్టణంలోని పురాతన శ్రీ చక్రేశ్వర శివాలయం ప్రత్యేక భక్తిపూర్వక కార్యక్రమాలకు సిద్ధమైంది. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్.రాములు ఈ వివరాలను ప్రకటించారు.
నవంబర్ 4న సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా నవంబర్ 5 సాయంత్రం భక్తుల సమక్షంలో విశిష్టంగా లక్ష దీపోత్సవం నిర్వహిస్తారన్నారు. దీంతో దేవాలయం పరిసరాలు వేలాది దీపాలతో ప్రకాశిస్తాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుని…





