భార‌త్ స‌మాచార్‌.నెట్, క‌ర్నూలు: శ్రీశైలానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నారుట్ల చెంచుగూడెంలో బుధవారం అర్ధరాత్రి ఒక చిన్నారిపై చిరుత దాడి చేసింది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలానికి చెందిన కుడుముల అంజయ్య, లింగేశ్వరి దంపతుల మూడేళ్ల చిన్నారి తల్లి పక్కన నిద్రిస్తుండగా అడవి నుంచి వచ్చిన చిరుతపులి ఈడ్చుకెళ్లింది. తండ్రి కేకలు వేసి వెంబడించడంతో, గ్రామ శివారులో చిన్నారిని వదిలేసి వెళ్లిపోయింది. చిరుత దాడిలో గాయపడిన చిన్నారిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడం…