భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ ప్రభుత్వం ప్రజా అభిప్రాయానికి, నిరుపేద అణగారిన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో జవాబుదారితనం, పారదర్శకతతో కూడిన మెరుగైన పాలన అందిస్తోందని కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ’ కార్యక్రమంలో భాగంగా ఇన్చార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రజాపాలనలో భాగంగా పెన్షన్ల దరఖాస్తుల డిజిటలైజేషన్ పూర్తయిందని, ప్రభుత్వం…





