భారత్ సమాచార్, (నెల్లికుదురు), మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ జిల్లా కేంద్రం మానుకోటలోని కీర్తి గార్డెన్‌లో ఈ నెల 27న తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా సర్పంచుల చైతన్య సదస్సుకు జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ పిలుపునిచ్చారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

ఈ సదస్సుకు తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి,…