భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కార్మికుల హక్కుల రక్షణ కోసం పోరాడుతున్న సీఐటీయూ నాయకులు గౌరీ, డిసెంబర్ 7న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కార్మిక మహా ప్రదర్శన, బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం వెల్దుర్తి మండల కేంద్రంలో సీఐటీయూ 5వ రాష్ట్ర మహాసభల గోడపత్రికను వారు ఆవిష్కరించారు. ఈ మహాసభలకు కార్మిక, కర్షక సోదరులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని గౌరీ సూచించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని, వాటి రక్షణ కోసం సీఐటీయూ నిరంతరం కృషి…