భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మాసాయిపేట మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని జిల్లాలో చేపడుతున్న భూముల రీ సర్వే ప్రక్రియపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఏడి ల్యాండ్ సర్వే కిషన్, మండల తహసీల్దార్‌తో కలిసి గ్రామసభకు హాజరైన ఆయన, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సమగ్ర సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు భవిష్యత్తులో భూమి రికార్డులు మరింత స్పష్టంగా, పారదర్శకంగా ఉండేలా…
రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం





