భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలో గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి, మత్తు పదార్థాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఎక్సైజ్ శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మద్యం విక్రయ కేంద్రాల పరిసరాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా…