భార‌త్ స‌మాచార్.నెట్, శ్రీకాకుళం జిల్లా : ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే కార్తీక మాసం తొలి రోజున, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ఆధ్యాత్మిక పర్యటన నిర్వహించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన టెక్కలి నియోజకవర్గం, రావివలస గ్రామంలో కొలువైన పురాతన ఆలయాన్ని దర్శించుకున్నారు. టెక్కలి మండలం రావివలసలోని స్వయంభు లింగంగా వెలసిన ఎండల మల్లిఖార్జున స్వామిని మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు సాయంత్రం
దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి అర్చకులు వేద మంత్రాలు పఠిస్తూ పూర్ణకుంభంతో…