భారత్ సమాచార్, ఆంధ్రప్రదేశ్: లాజిస్టిక్స్, చమురు, ఖనిజాలు, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో పేరెన్నికగన్న ట్రాఫిగురా ఇండియా (Trafigura India) సీఈవో సచిన్ గుప్తాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో భేటీ అయ్యారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో $243.2 బిలియన్ డాలర్ల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిన ట్రాఫిగురా.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తో $1.4 బిలియన్ డాలర్ల విలువైన ఎల్‌ఎన్‌జీ సరఫరా ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నం పోర్టు నుంచి బొగ్గు, జింక్, అల్యూమినియం…