భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలు ఎండిపోయి పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని నర్సాపూర్ MLA వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నెలల తరబడి కష్టపడి పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు వృథా అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
విద్యుత్ కోతలకు కారణాలేంటి?
వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు…






