భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘రైతన్నా… మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గార్లదిన్నె గ్రామంలో పర్యటించారు. గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని రచ్చబండ నిర్వహించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, అధికారులు, రైతులు, మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్



