భారత్ స‌మాచార్.నెట్, మెద‌క్‌: నర్సాపూర్ నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఊరటనిస్తూ, మెదక్ జిల్లా ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి ఆర్థిక సహాయం అందించారు. గురువారం ఆమె పలు మండలాలలోని బాధిత కుటుంబాలకు చెందిన సభ్యులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.6,60,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కవిత అమర్ సింగ్, సంతోష్ మేఘమాల, పంబల్ల భిక్షపతి, భోగ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.