భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి నిదర్శనమని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (GMR) పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం బీరంగూడ డివిజన్ పరిధిలోని ఇసుక బావి కాలనీలో బిఆర్ఎస్ నాయకుడు యునూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నియోజకవర్గంలోని మైనార్టీల అభ్యున్నతికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని, వారికి పెద్దపీట వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.…