భారత్ సమాచార్, కర్నూలు జిల్లా:వెల్దుర్తి రైతుసేవా కేంద్రంలో జరిగిన రైతన్న-మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్యాంకుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు 90% సబ్సిడీపై పరికరాలు, విత్తనాలు, ఎరువులు అందిస్తున్నదని, అన్నదాత సుఖీభవ కింద రూ.6310 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని చెరువులకు నీరు అందించడంలో కేఈ కృష్ణమూర్తి పాత్రను గుర్తుచేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
రైతన్న-మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే





