భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో రూ.5 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఎమ్మిగనూరు – మాలపల్లి – కోసిగి రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 30 ఏళ్ల క్రితం ఈ రహదారిని దివంగత నేత బీవీ మోహన్ రెడ్డి ప్రారంభించగా, ఇప్పుడు ఆయన తనయుడు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రహదారి పూర్తయితే రైతులకు పంటల రవాణా…