భారత్ సమాచార్, సంగారెడ్డి: గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి గ్రామంలో శాండ్విక్ పరిశ్రమ కోటి రూపాయల సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉపేందర్, మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, పరిశ్రమ సి ఎస్ ఆర్ హెడ్ రవి వర్మ, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.