భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పటాన్ చెరు మండలం భానూరు గ్రామంలో ఆర్కే స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అండర్ 14, అండర్ 17 కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఐ విజయ్ కృష్ణ, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గోపాల్, రామకృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.