భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోనిలోని మైనారిటీ కాలనీలో రూ.21 లక్షల వ్యయంతో రోడ్డు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. పార్థసారథి భూమి పూజ చేసి ప్రారంభించారు. పట్టణానికి దూరంగా ఉండటంతో గతంలో ఈ కాలనీ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. గత నిర్లక్ష్యానికి ముగింపు పలికి కాలనీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొచ్చి శాశ్వత రోడ్డు సదుపాయం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపాల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్లు, కౌన్సిలర్లు,…