భారత్ సమాచార్.నెట్, కర్నూల్: ఆదోని పట్టణం నుంచి ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీకి వెళ్లే ప్రధాన రోడ్డులో ఉన్న జింకవంక స్థలం దగ్గర భారీ వర్షాలకు వరద నీరు చేరి పంట పొలాలు మునిగిపోవడంతో వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారి ప్రధాన సమస్యను పరిష్కరించడానికి ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి చొరవ తీసుకున్నారు. రైతుల అభ్యర్థన మేరకు మంగళవారం అధికారులతో కలిసి జింకవంక ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.
దాదాపు 150 ఎకరాల పచ్చని పంట నీటిలో నాశనమైందని రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు.…





