భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మృగశిర కార్తెను పురస్కరించుకొని నర్సాపూర్ పట్టణంలో చేపల వ్యాపారులు, రైతులు పెద్దఎత్తున చేపల విక్రయ షాపులను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే మృగశిర కార్తెను పురస్కరించుకొని పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు చేపలను కొనుగోలు చేస్తుంటారు. అందుకు అనుగుణంగా రైతులు, వ్యాపారులు అనేక రకాల చేపలను మార్కెట్‌కు తీసుకువచ్చారు. దీంతో నర్సాపూర్ లోని చేపల మార్కెట్ ప్రధాన రహదారులు వ్యాపారులు వినియోగదారులతో కిక్కిరిసిపోతుంది. కాగా చేపల విక్రయాల సందర్భంగా మున్సిపల్ సిబ్బంది కూడా వ్యాపారులకు పలు సూచనలు…