భారత్ సమాచార్.నెట్ కర్నూలు: ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో జరుగుతున్న దీక్షకు ఎమ్మార్పీఎస్ సంఘీభావం ప్రకటించింది. నియోజకవర్గ ఇంఛార్జి బండారి గిడ్డయ్య ఆధ్వర్యంలో సుమారు 50 మంది కార్యకర్తలు మున్సిపల్ మైదానం నుంచి ర్యాలీగా బయలుదేరి బీమాస్‌ కూడలిలోని దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు.

ఎంఎస్‌పీ, ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఆదోని డివిజన్‌కు కర్నూలు 100 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆదోనిలో మౌలిక వసతులు పుష్కలంగా ఉన్నందున, చుట్టుపక్కల నియోజకవర్గాలను కలిపి…