భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం మున్సిపల్ చైర్మన్ మల్లేష్ లక్ష్మీ రాజు యాదవ్ సందర్శించి, వసతులను తనిఖీ చేశారు. పాఠశాలలోని తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదుల పరిశుభ్రతను స్వయంగా పరిశీలించిన ఆయన, విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలపై ప్రధానోపాధ్యాయులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రాధాన్యతని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి నాణ్యమైన విద్యను అందించాలని కోరారు.…