భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్‌కు ఉత్తమ తహసీల్దార్ అవార్డు లభించింది. నర్సాపూర్ మండల పరిధిలో ప్రజలకు అందించిన సేవలు, రెవెన్యూ పరిపాలనలో చూపిన పనితీరును గుర్తిస్తూ ఆయనకు ఈ పురస్కారం అందజేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాస్ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనను అభినందించారు.

నర్సాపూర్ మండలంలో ప్రజలకు రెవెన్యూ సేవలను అందించడంలో తహసీల్దార్ శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం,…