భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మెల్లూరు గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా నవీన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఆయన అధికారికంగా ఛార్జి తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రంగారెడ్డి నూతన కార్యదర్శి నవీన్ రెడ్డిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.…