భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివ్వంపేట్ మండలం గంగాయిపల్లి గ్రామ సర్పంచ్ సాయిలు, మాజీ సర్పంచ్ వెంకటేష్, సీతారామ్ తండా సర్పంచ్ సహాదేవ్‌లు నేడు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో ఇటీవల సర్పంచ్‌లుగా గెలుపొందిన పలువురు ప్రజాప్రతినిధులు ఆవుల రాజిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని…