భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: జనగామ జిల్లాల సాగరంలోని గాదె ఇన్నయ్య ఇంటితో పాటు జాఫర్ గఢ్ లోని ‘మా ఇల్లు’ ఆశ్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇవాళ ఉదయం 6.30 గంటల సమయంలో ఆశ్రమంలోకి ప్రవేశించిన అధికారులు ఇప్పటికీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీలకు సంబంధించిన వివరాలను ఎస్ఐఏ ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. కాగా, మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో మాజీ మావోయిస్టు, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యపై ఎస్ఐఏ గతంలో కేసు నమోదు చేసింది.

 

…