భారత్ సమాచార్, మెదక్ జిల్లా:  పోషన్ అభియాన్ జాతీయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోషణ్ మాసం కార్యక్రమాన్ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంపూర్ణ ఆహారం, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ప్రకృతిలో దొరికే ఆకుకూరలు, పిండి పదార్థాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రాహుల్ మాట్లాడుతూ రక్తహీనత, పోషణ…