భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: విద్యార్థినిలు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప అన్నారు. శుక్రవారం కర్నూలులోని ఆచ్ఐవో కార్యాలయంలో కేవీఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులకు ఓజేటీ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృత్తి విద్యకు ప్రస్తుత పరిస్థితుల్లో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, విద్యార్థినిలు శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.…
విద్యార్థినులకు ఓజేటీ సర్టిఫికెట్ల అందజేత





