భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: అమరజీవి పొట్టి శ్రీరాములు 74వ వర్ధంతి సందర్భంగా ఆదోని పట్టణంలో ఆవోపా, వామ్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా డీఎస్పీ బంగ్లా వద్ద ఉన్న మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్‌లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు, ఆంధ్ర రాష్ట్రం…