భారత్ సమాచార్ (నెల్లికుదురు), మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దశాబ్ద కాలంగా తాను పార్టీ కోసం కష్టపడి పనిచేశానని, తన సేవలను గుర్తించి నెల్లికుదురు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ పదవిని తనకు కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ కోరారు. గురువారం మండల కేంద్రం నెల్లికుదురులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నెల్లికుదురు మండలంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాల్లో…





